సాంకేతిక సమస్య.....అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం, టేకాఫ్ అయిన కొంత సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది.
Flight


ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.)బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం,

టేకాఫ్ అయిన కొంత సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు లండన్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. విమానాన్ని అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టించారు. అనంతరం వెనక్కి తీసుకువచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 270మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, విమానాన్ని తనిఖీలకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande