గణేష్ ఊరేగింపులో తొక్కిసలాట.. యువకుడు మృతి
వినాయక చవితి పండుగ సందడి ప్రారంభమవుతున్న వేళ గణేష్ ఆగమన్ (విగ్రహ ఊరేగింపు) కార్యక్రమంలో జరిగిన ఊహించని తొక్కిసలాటలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Accident

హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.)

వినాయక చవితి పండుగ సందడి ప్రారంభమవుతున్న వేళ గణేష్ ఆగమన్ (విగ్రహ ఊరేగింపు) కార్యక్రమంలో జరిగిన ఊహించని తొక్కిసలాటలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. గత రాత్రి రామ్ నగర్ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ఆగమన్ ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపుకు వేలాది సంఖ్యలో జనం, ముఖ్యంగా యువత తరలి వచ్చింది. ఊరేగింపు సాగుతున్న సమయంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ, భారీ డీజే శబ్దాల మధ్య డ్యాన్సులు చేస్తూండగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తీవ్ర గందరగోళం, తోపులాటలో బద్రీనాథ్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande