పట్టాలు తప్పిన మహానంద ఎక్స్ప్రెస్.....రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహానంద ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల రైలు ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
Rail


ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.)

మహానంద ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల రైలు ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. మహానంద ఎక్స్ప్రెస్ రైలు 15483 అలీపుర్దువార్ జంక్షన్-ఢిల్లీ సిక్కిం మహానంద ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం 4.12 గంటలకు బీహార్లోని ఆరా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ రెండుకు చేరుకున్నది.కాగా, ఢిల్లీ వెళ్లాల్సిన ఆ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ససారం అప్ లైన్ వైపు సిగ్నల్ చూపించడంతో ఆ రైలు ముందుకు కదిలింది. అయితే స్టేషన్కు సుమారు 200 మీటర్ల దూరంలో అది పట్టాలు తప్పింది. కాగా, సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సంఘటన వల్ల ఆ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande