ఫాంహౌస్ కే పరిమితమై ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాసిన కేసీఆర్.... కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సెటైర్
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు.
Ponguleti


హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. దొర పోకడలతో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు రాచరిక రోజులను తలపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

ప్రతిపక్ష నాయకుడి హోదాలో గత 1000 రోజులలో రూ.1 కోటికి పైగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని రూ. 21 కోట్లకు పైగా భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. అయినా శాసనసభకు హాజరుకాకుండా పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితమై ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాసిన కేసీఆర్... ఈ రోజు ఎర్రవెల్లి ఫాం హౌస్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం నియంత పోకడలకు నిదర్శనం అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే... రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాం హౌస్ లోనే నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande