షార్ట్ సర్క్యూట్..... భాదిత కుటుంబానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భరోసా
స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన ఘటన స్థలాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.
Mla


స్టేషన్గన్పూర్, 06 సెప్టెంబర్ (హి.స.) స్టేషన్ ఘనపూర్ మండలం

రాఘవపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన ఘటన స్థలాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.

ప్రమాదంలో పిల్లల విద్యా సర్టిఫికెట్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు, నగదు పూర్తిగా కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.

బాధిత కుటుంబాన్ని కడియం శ్రీహరి ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 50 సిమెంట్ బస్తాలను వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande