
జోగులాంబ గద్వాల , 06 సెప్టెంబర్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మౌనిక, సాయికుమార్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ముఖేశ్ గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ యాక్సిడెంట్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు