జేఎన్యూలో ప్రొఫెసర్ పై విద్యార్థినుల ఫిర్యాదు
ప్రముఖ యూనివర్సిటీ (జేఎన్యూ)లో 10 మంది విద్యార్థినులు ఒక ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
JNU


ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ యూనివర్సిటీ (జేఎన్యూ)లో 10 మంది విద్యార్థినులు ఒక ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినుల్ని ప్రైవేట్ మీటింగ్ కోసం తన ఇంటికి రమ్మని పిలిచేవాడు. అలాగే, అక్కడ విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడు. క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్నప్పుడు కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడు. దీంతో ఈ వేధింపులను కొంతకాలం భరించిన విద్యార్థినులు నెల రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం యూనివర్సిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande