
హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో జరుగుతున్న 'ఎస్ఐఆర్' ప్రక్రియలో మరో 25 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 47 లక్షల మంది ఓటర్లకు మాత్రమే అందాయి. వీరిలో కేవలం 9 లక్షల మంది మాత్రమే అందుకున్న నోటీసులకు సమాధానం అందించారు.
అయితే, కొన్ని చోట్ల నోటిసులకు సమాధానం ఇవ్వడానికి ఓటర్లు ముందుకు రావడంలేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఓటర్లు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 16న నోటీసుల ప్రక్రియ పూర్తికానుంది. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నోటీసుల పంపిణీ, సమాధానాలు సాధ్యం కాదనే ఉద్దేశంతో మరింత సమయం ఇవ్వాలని ఈసీని కోరినట్టు తెలిసింది.
దూరప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లినవారు రూ.వందలు, వేలు ఖర్చు చేసి రావడం.. వ్యాపారం, ఉద్యోగానికి ఒక రోజు సెలవు పెట్టి రావాల్సి ఉండటంతో నోటీసులకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు