
ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.)ఏపీ వాతావరణ శాఖ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో 3 గంటల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అంచనా వేసింది. గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేటలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్