దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లును మొదలు పెట్టింది.
Vijayawada temple


ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.)దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లును మొదలు పెట్టింది. ఉత్సవాలకు కనకదుర్గమ్మ దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి త్వరితగతిన దర్శనమయ్యేలా చూసేందుకు ఆలయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే నెలలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు సాధారణ రోజుల్లో లక్షకు పైగా, మూలానక్షత్రం నాడు 2.5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకోసం అన్నీ ఏర్పాట్లను సక్రమంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande