
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన ఛాంబర్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ విషయంపై సీఎం చర్చించారు.
రేవంత్రెడ్డితో భేటీకి మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.
అలాగే, బీఆర్ఎస్ పార్టీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు వ్యవహరించిన తీరుపై సీఎం ఆరా తీశారు. పోలీసులు, స్పీకర్పై చేసిన వ్యాఖ్యల వీడియోలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ నేపథ్యంలో మధుపై చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ను సీఎం రేవంత్కో రెడ్డి కోరినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్