శరవేగంగా విజయవాడ బైపాస్ రైల్వే లైను పనులు
విజయవాడ బైపాస్ రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. 22 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ రైలు మార్గం పనుల్ని 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు.
Railway


ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.)విజయవాడ బైపాస్ రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. 22 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ రైలు మార్గం పనుల్ని 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. రాయనపాడు-ముస్తాబాద మార్గంలో రెండు చోట్ల రైల్ ఓవర్ రైలు వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ-విశాఖ మార్గంలో సరకు రవాణా మరింత వేగవంతం కానుంది. విజయవాడ రైలు జంక్షన్ మీదుగా నిత్యం వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్ల రాకపోకలతో ప్రధాన స్టేషన్ రద్దీగా ఉంటుంది. విశాఖ-ఖాజీపేట మార్గంలో ప్రయాణించే గూడ్స్ రైళ్లు తప్పని సరిగా విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి గూడ్స్ రైళ్లు గంటల కొద్దీ లూప్ లైన్లలో వేచి ఉండే పరిస్థితి ఉంది. సమస్య అధిగమించేందుకు రైల్వే ఇంజినీరింగ్ విభాగం భారీ ప్రాజెక్ట్ చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande