
ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.) ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారీ సంఖ్యలో సైబర్ మోసాల
ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎన్సీఆర్పీ, 1930 పోర్టల్కు జనవరి నుంచి జూన్ వరకు 2,145 ఫిర్యాదులు రాగా వీటిలో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రూ.21.90 కోట్లు అని తేలింది.
సైబర్ నేరగాళ్ళు లాభాల ఆశ చూపించి నిలువునా ముంచుతున్నారు. తొలుత కొంత మొత్తంలో నగదు జమ చేసి, నమ్మకం కలిగిస్తున్నారు. తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు రూపంలో డబ్బు జమ చేయించుకుని ఆ సొమ్ము స్వాహా చేస్తున్నారు. మొత్తం ఫిర్యాదుల్లో పదో వంతు పెట్టుబడుల పేరుతో జరిగినవే. ఈ తరహా మోసాల్లో తొలుత లింక్ పంపి యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. వందల మంది దీని ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చూపిస్తారు. మీ పేరుతో ఖాతా తెరిచి పెట్టుబడులు పెట్టిస్తారు. తర్వాత నేరగాళ్లు బాధితుల ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా కాకుండా ఆపేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్