
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) వంట గ్యాస్ సిలిండర్ వినియోగ దారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వంటగ్యాస్ బుకింగ్ గడువును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి సురేశ్ గోపీ సోమవారం వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై పడిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని గతంలో దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది.
ఆ మార్పుల ప్రకారం రీఫిల్ బుకింగ్ మధ్య గడువు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో పాటు రీఫిల్ పెండింగ్ బాకీలు (బ్యాక్ లాగ్) కూడా గణియంగా తగ్గడంతో ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా 25 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు