
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
జీవో 111 పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన భారీ వెంచర్ను నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారులు సోమవారం కూల్చివేశారు. సర్కిల్ పరిధిలోని జన్వాడ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, నాలా కన్వర్షన్ చేయకుండా కొందరు సుమారు 60 ఎకరాలకు పైగా స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసి అందులో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకొని వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా భారీగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పొందుపరిచారు. చాలా నెలలుగా ఈ తతంగం నడుస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ఇటీవల మీడియాలో కథనాలు వెలుపడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీదా, టీపీఎస్ రమేష్ మున్సిపల్ సిబ్బంది వెంచర్ సందర్శించి వివరాలు సేకరించారు. నోటీసు ఇచ్చి వెంటనే కూల్చి వేస్తామని అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు