
ఢిల్లీ , 07 సెప్టెంబర్ (హి.స.) భారత్- ఫ్రాన్స్ మధ్య బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాదని, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలే దానికి బలమైన పునాదిగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పారిస్లో నిర్మించిన బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన మోదీ...ఈ సందర్భంగా మాట్లాడుతూ....
ఫ్రాన్స్ మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. సంస్కృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఫ్రెంచ్ పండితులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమైన్ రోలాండ్ రాసిన రచనలు మన సమాజాలను మరింత దగ్గర చేశాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పారిస్ నుంచి పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమం వరకు 'ది మదర్' చేసిన ఆధ్యాత్మిక యాత్ర ఇరు దేశాల సాధకులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్