ఆర్టీసీ విలీనంపై అసెంబ్లీలో మంత్రి పొన్నం క్లారిటీ
ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది ఇంకా కార్యాచరణలోకి రాలేదన్నారు.
Ponnam


హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స): ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది ఇంకా కార్యాచరణలోకి రాలేదన్నారు. గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిపిన తర్వాతే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి.. ఆర్టీసీతో ప్రభుత్వం చర్చల్లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం కోసం ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వంలో విలీనం చేసి 11 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

ఈ మేరకు ఆర్టీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ జేఏసీతో జరిగిన చర్చల అంశాల నుంచి ప్రభుత్వం ఎక్కడా పక్కకు వెళ్లడం లేదని ఆర్టీసీ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విలీనంతో అనేక సమస్యలు వచ్చాయని అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉండొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande