
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
నాకు దేశం, ప్రజలు ఫస్త్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన తెలంగాణ, ఏపీ జల వివాదాలపై స్పందించారు. జలాలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నామనడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా కృష్ణా నీళ్ళ హక్కులపై గట్టిగా కొట్లాడుతున్నామని చెప్పారు.
మంత్రిగా తాను ట్రిబ్యునల్ వాదనలకు హాజరయ్యానని చెప్పారు. 811 టీఎంసీల్లో 299 టీఎంసీలు మనకు, 512 టీఎంసీలు ఏపీకి కేసిఆర్, హరీష్ రావు రాసిచ్చారని తెలిపారు. 555 టీఎంసీలు కావాలని తాము వాదిస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి బోర్డులను రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటు చేశారని, విభజన చట్టాన్ని తానే రాయించానని కేసీఆర్ చెప్పారు కదా అని గుర్తు చేశారు.
పాలమూరు రంగారెడ్డిని ఒరిజినల్గా జూరాల సోర్సుగా నిర్మించేందుకు జీవో ఇచ్చారు. దానిని శ్రీశైలంకు మార్చింది కేసీఆర్. నార్లాపూర్ దగ్గర పంపులు ఒక గంట నడిపి తామే ప్రాజెక్టును కట్టినట్టు చెప్పుకుంటున్నారు. మేము రిపేర్లు చేసి నడిపిస్తున్నాం. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీని పడవు పెట్టి పోయారు. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి పైసా ప్రయోజనం చెయ్యలేదు. జూరాల నుంచి పాలమూరు కట్టి ఉంటే ఎప్పుడో 70 టీఎంసీలు తరలించి 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. డిండి ప్రాజెక్టులు అసలు సోర్సును కూడా చెప్పలేదు. మేము వచ్చాకా సోర్సు ఫైనల్ చేసి టెండర్లు కూడా పిలిచినం. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. గౌరవెల్లి, సీతారామ సాగర్, డిండి వంటి ప్రాజెక్టులకు పదేండ్లు అధికారంలో ఉంది కూడా పర్యావరణ అనుమతులు ఎందుకు తీసుకోలేదు..?.” అని ఉత్తమ్ తెలిపారు.
ప్రాజెక్టులకు 2000 కోట్ల పనులే ఉన్న.. దానిని 20 వేల కోట్లకు పెంచారు.మేము వచ్చాకే కృష్ణాలో ఎక్కువ నీళ్లు వాడినం. ఆయకట్టు పెరిగింది.. వడ్ల ఉత్పత్తి ఎక్కువ జరిగింది మా పాలనలోనే. వడ్ల సమీకరణలో తొలుత కొంత సమస్య వచ్చిన మాట వాస్తవమే.. బెంగాల్, బీహార్ నుంచి హమాలీల కొరతతో సమస్య వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రికార్డ్ స్థాయిలో వడ్లు సేకరించినం. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. తాము కట్టి కూలిపోయిన ప్రాజెక్ట్ కాళేశ్వరంను చూపించడానికి జనాన్ని తీసుకెళ్తారా. నేను రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రిని.. ఎవరు సలహాదారుగా ఉండాలో నేను డిసైడ్ చేస్తా.. వాళ్ళు కాదు.” అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు