ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం....... అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు
ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను ప్రకటించింది.
NTR barosa pensions


ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.)ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను ప్రకటించింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పింఛను పథకం అమలులో ఆరంచెల తనిఖీ విధానాన్ని అమలు చేయనున్నారు. అనర్హులుగా తేలిన వారికి అందుకు కారణాలు తెలియజేస్తూ పత్రాన్ని అందిస్తారు. వివిధ దశల్లో పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే ఉత్తర్వులకు అనుగుణంగా కేటగిరీల వారీగా, విడతల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande