
ఢిల్లీ , 07 సెప్టెంబర్ (హి.స.) కర్ణాటకలోని బెళగావికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. ఆయన విద్యార్థుల దైనందిన కార్యకలాపాలు, టాలెంట్కు సంబంధించిన వీడియోలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవారు. ఆ పిల్లల ప్రతిభను గుర్తించిన అనేకమంది దాతలు ఇప్పటివరకు రూ. కోటికి పైగా విరాళాలను స్కూల్కు అందించారు. ఆ నిధులతో పాఠశాలలో అత్యాధునిక ప్రయోగశాలలు (లేబొరేటరీలు) నిర్మించారు. అలాగే క్యాంటీన్, స్వచ్ఛమైన తాగునీటి యూనిట్, డెస్క్లు, డిజిటల్ బోర్డ్, డిజిటల్ ల్యాబ్, ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్, ఆడిటోరియం వంటి అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
గత 17 ఏళ్లుగా అదే స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకు రాకముందు ఈ పాఠశాల ఇలా ఉండేది కాదు. పాత గదులు, మౌళిక సదుపాయాల కొరతతో ఉండేది. విద్యార్థులు కూడా స్కూల్కు సరిగ్గా వచ్చేవారు కాదు. అలాగే అధునాతన సౌకర్యాలు ఊసే కాదు, తాగునీటి సదుపాయం కూడా లేదు. బసవరాజ సుంగారి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. ఒక టీచర్ తలచుకుంటే పాఠశాలను ఎంతలా మార్చగలరో ఆయన నిరూపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్