బీజేపీ రాంచందర్రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Ramachandra rao


హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు(సోమవారం) ఉదయం నుంచి దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. వరుసగా అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ నేతలు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోసారి అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నించడంతో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాంచందర్రావు అరెస్ట్ సందర్భంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో గన్పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ తెలంగాణ చీఫ్ను పోలీసులు తీసుకెళ్లకుండా రోడ్డుపై పడుకుని మరీ బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు. రాంచందర్ రావును తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపైకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఎక్కడంతో.. వెంటనే పోలీసులు అతడిని లాగి పడేశారు.. దీంతో అసెంబ్లీ వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరగగా, పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande