సత్యానికేతన్లో పీజీ హాస్టల్ ఘటన.........ఏడుకు చేరిన మృతుల సంఖ్య
దేశ రాజధాని సత్యానికేతన్లో పీజీ హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. 12 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Building collapse


ఢిల్లీ , 07 సెప్టెంబర్ (హి.స.)దేశ రాజధాని సత్యానికేతన్లో పీజీ హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. 12 మంది విద్యార్థులు గాయపడ్డారు.

ఈ ఘటనకి సంబందించిన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్ శాఖ అయిదుగురు అధికారులపై సస్పెన్షన్ విధించింది.

దక్షిణ జోన్ డిప్యూటీ కమీషనర్ రాకేశ్ కుమార్తో పాటు నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సూపరెంటెండింగ్ ఇంజినీర్ రన్వీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(బిల్డింగ్) లలిత్ కుమార్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్(బిల్డింగ్) సునీల్ చౌహాన్, జూనియర్ ఇంజినీర్(బిల్డింగ్ ఆశిశ్ కుమార్ వేటు పడినవారిలో ఉన్నారు. ఢిల్లీ మున్సిపాల్టీకి చెందిన విజిలెన్స్ శాఖ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చింది. విజిలెన్స్ ఆఫీరస్ నంద కిషోర్ ఆ దేశాలు ఇచ్చారు. పీజీ హాస్టల్ బిల్డింగ్ ఓనర్లను గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande