
ఢిల్లీ , 07 సెప్టెంబర్ (హి.స.) ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వర్తలని ఆ సంస్థ తోసిపుచ్చింది. సంస్థను ప్రైవేటీకరించటం జరుగదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం నాడు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇస్రో ప్రాధాన్యతను తగ్గించటం కాదని, సంస్థను ప్రైవేటీకరించటంగా భావించరాదని స్పష్టం చేసింది.
మార్పు వల్ల ఇస్రో సరికొత్త మిషన్లపై దృష్టి సారిస్తుండగా, పరిశ్రమలు అభివృద్ధి చెందిన వ్యవస్థలను విస్తరించడానికి వీలవుతుందని తెలిపింది. అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, వ్యూహాత్మక మిషన్లు, అన్వేషణలో ఇస్రో తన పాత్రను కొనసాగిస్తుందని సంస్థ పేర్కొన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్