
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
శాసనసభ సమావేశాల ప్రారంభం రోజేఅసెంబ్లీ గేట్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, పోలీసుల తీరుపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగిన వేళ తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది.
పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి, పోలీసు శాఖకు స్పష్టమైన కీలక ఆదేశాలు జారీ చేసింది.
సభకు శాసనసభ, మండలి సభకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అడ్డుకోవడానికి వీళ్లేదని కోర్టు తేల్చిచెప్పింది. ప్రజాప్రతినిధులు విధులకు హాజరవుతున్న సమయంలో పోలీసుల జోక్యం సరికాదని పేర్కొన్నది. ఒకవేళ సభ్యులు సభలో, నిబంధనలు ఏమైనా ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం కేవలం స్పీకర్కు మాత్రమే ఉంటుందని, పోలీసులే స్వయంగా శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..