
ఆంధ్రప్రదేశ్ , 07 సెప్టెంబర్ (హి.స.)వెలిగొండ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకుంది.
కృష్ణమ్మ పరుగులు పెడుతుండడంలో ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కృష్ణ జలాలకు జలహారతి, పూజలు నిర్వహిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, రైతులు, మహిళలు యువకులు తరలివస్తున్నారు. కృతజ్ఞతగా కృష్ణమ్మకు పూజలు చేస్తున్నారు. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు. దోర్నాల మండలం గంటవానిపల్లె దగ్గర ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పైలాన్, ప్రాజెక్టు గేట్లు, జలహారతి ప్రదేశం, నీటి ప్రవాహాలు. శిలా ఫలకాలు, నీటి నిల్వలు తదితర సుందరమైన దృశ్యాలను తిలకిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్