మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు...... తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు...... తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
CM Vijay


ఢిల్లీ , 07 సెప్టెంబర్ (హి.స.) మహిళలపై అనుచితమైన, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో అయన మాట్లాడుతూ..... అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. డీఎంకే బండారం మొత్తం అధికారిక రికార్డుల్లో, అసెంబ్లీ లైబ్రరీలో అందుబాటులో ఉందని విజయ్ అన్నారు. 1977 నాటి సర్కారియా కమిషన్ నివేదికను ఆయన ఉటంకించారు. వీరాణం పైప్లైన్ ప్రాజెక్ట్లో కాంట్రాక్టులు ఇచ్చేందుకు కమీషన్లు డిమాండ్ చేశారని, ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఇంకా, పార్టీ ఫండ్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని, కొన్ని లావాదేవీలలో 7.5 నుంచి 10 శాతం వరకు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.

ఈడీ ఆరోపణలకు సంబంధించి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. డీఎంకే అవినీతికి సంబంధించిన రికార్డులు చాలా ఉన్నాయని, అవన్నీ చదవాలంటే దాదాపు రెండు రోజులు పడుతుందని, అందుకే సభలో కేవలం సారాంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నానని సీఎం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande