శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రావణ సోమవారంతో శ్రీశైలంలో పోటెత్తిన భక్తజనం!
శ్రీశైలం


శ్రీశైలం, 07 సెప్టెంబర్ (హి.స.) శ్రీశైలం దేవస్థానంలో సోమవారం భక్తుల కోలాహలం కనిపించింది . వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసారు . శ్రద్ధగా క్యూ పాటించి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు .సామూహిక అభిషేకాల్లో పాల్గొన్నారు . కోటి శివ పంచాక్షరి,శ్రీ భ్రమరి కోటి లేఖన కార్యక్రమాన్నిప్రారంభించారు . సహస్ర దీపార్చన సేవ ఘనంగా జరిగింది.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి పెరిగిన భక్తులు శ్రావణమాసం పైగా సోమవారం కావడంతో క్షేత్రానికి భారీగా తరలి వచ్చిన ,భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కోసం ఆర్జిత అభిషేకాలు,స్పర్శ దర్శనాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేసిన చేశారు. భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనాలకు అనుమతి ప్రోటోకాల్ సిఫార్సుతో వచ్చే భక్తులకు రాత్రి 8.30 స్పర్శ దర్శనం కల్పించారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు ప్రముఖులు సిఫార్సుపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు అలానే ప్రముఖులు మాత్రం క్షేత్రానికి స్వయంగా వస్తేనే ఈ మూడు రోజులలో ఉదయం వేళలో స్పర్శ దర్శనం కల్పిస్తు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగతిన అవుతున్నాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande