
తిరుపతి, 07 సెప్టెంబర్ (హి.స.)నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన ర్యాలీ చేపట్టింది. తిరుపతిలో భూమన అభినయ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
బియ్యం నుంచి పప్పు వరకు.. ఉల్లి నుంచి నూనె వరకు.. చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యుడికి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పెరిగిన ధరలతో ప్రజలు పడుతున్న కష్టాలను వినూత్న రీతిలో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ‘భారమైన బతుకు బండి’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ రాయచోటిలో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. కూరగాయలు, గ్యాస్ సిలిండర్తో తోపుడు బండిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై భారం పడిందని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV