
అమరావతి, 08 సెప్టెంబర్ (హి.స.)
యూట్యూబర్ బచ్చలకూరి రావణ్కు గన్నవరం కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్ను ఈ నెల 22 వరకు పొడిగించింది.
ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న రావణ్ను విచారణ నిమిత్తం గన్నవరం కోర్టుకు పోలీసులు తరలించారు. విచారణ అనంతరం రిమాండ్ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై జులై 5న రావణ్పై కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ