
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్ను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
అయితే, రూ.10 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ష్యూరిటీలు సమర్పించిన తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్