బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు అరెస్ట్..
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Brs

హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

స్పీకర్ ఓఎన్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకున్న పోలీసు బలగాలు ఎమ్మెల్సీ తాతా మధును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande