బంగాల్ల్ దసరా వేడుకలపై బీజేపీ సర్కార్ కీలక ప్రకటన
బీజేపీ సర్కార్ బంగాల్ల్ దసరా వేడుకలపై కీలక ప్రకటనలు చేసింది.
Bengal


ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)బీజేపీ సర్కార్ బంగాల్ల్ దసరా వేడుకలపై కీలక ప్రకటనలు చేసింది. దుర్గాపూజ కమిటీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం సువేందు అధికారి, దుర్గాపూజ కమిటీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పూజా కమిటీలకు విద్యుత్ ఛార్జీలు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ పొందడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. మహాలయ రోజు ఈడెన్ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గా పూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. దుర్గా పూజ వేడుకల సమయంలో డీజేల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అష్టమి రోజు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande