
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం కలిశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో సోమవారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు ఆయనను కలిసి పరామర్శించారు. అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై లోతుగా చర్చించిన ముఖ్యమంత్రి, నిన్నటి ఘటనల పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు.
స్పీకర్ని ఓదార్చిన సీఎం, ప్రభుత్వ పరంగా సంపూర్ణ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..