ఈఫిల్ టవర్ ఉద్యోగులధర్నా
ఈఫిల్ టవర్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈఫిల్ టవర్ను మూసివేశారు.
Effil tower


ఢిల్లీ, 08 సెప్టెంబర్ (హి.స.)ఈఫిల్ టవర్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈఫిల్ టవర్ను మూసివేశారు. శనివారం నాడు

ఈఫిల్ టవర్ను ఓ హిందూ సంస్థకు చెందిన సాధువులు విజిట్ చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఈ చర్యలను ఖండిస్తూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్తాన్ (బీఏపీఎస్) సంస్థకు చెందిన సుమారు 100 మంది హిందూ సాధవులు ఈఫిల్ టవర్ను సందర్శించారు. ఆ సందర్శన సమయంలో మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారు. హిందూ సాధువులకు మహిళలు కనబడాకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande