పంజాబ్లో రాజకీయ దుమారం.... రైతు ఆత్మహత్య
పంజాబ్లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది. పంజాబ్కు చెందిన 50 ఏళ్ల రైతు గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Suicide


ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)పంజాబ్లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది.

పంజాబ్కు చెందిన 50 ఏళ్ల రైతు గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషపూరిత సల్ఫస్ను తీసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం సంగ్రూర్ ఆస్పత్రిలో రైతు గుల్జార్ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అమ్మకాలపై రైతు గుల్జార్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన కుమారుడు డ్రగ్స్కు బానిసైనట్లు రైతు గుల్జార్ పేర్కొన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అతనిపై పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక రైతు గుల్జార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపుల వల్లే గుల్జార్ విషపూరిత పదార్ధాన్ని సేవించినట్లు తెలిసింది. లాథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande