ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా సుబేదారి రెడ్స్ సమీపంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయి మంగళవారం పరిశీలించారు.
Collector

హనుమకొండ, 08 సెప్టెంబర్ (హి.స.)

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా సుబేదారి రెడ్స్ సమీపంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయి మంగళవారం పరిశీలించారు.

అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, స్ట్రాంగ్లూమ్ల పరిస్థితి, సీళ్లు, భద్రతకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, ఇతర భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్ట్రాంగ్లూమ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్రూమ్ల సీళ్లు, తాళాలు, ప్రవేశ-నిష్క్రమణ విధానం, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande