బీఆర్ఎస్ మహిళా నేతలపై దాడి చేయించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 420, 1000 రోజుల పరిపాలనతో పాటు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అవన్నీ చర్చకు రాకుండా తప్పించుకోవడానికే చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు తప్ప ఇంకేమీ కాదంటూ దుయ్యబట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారని.. అన్నీ అర్థం చేసుకుంటారని తెలిపారు.

తప్పకుండా ఈరోజు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అన్ని విషయాల్లోనూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేల విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలిలో చర్చ జరగాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande