హకీంపేటలో ఉద్రిక్తత
ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ఎస్సీ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.
Ktr


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)

ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ఎస్సీ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ శ్రేణులను నిర్బంధిస్తున్నారు.

మరోవైపు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరిని కేటీఆర్, హరీష్ రావుల కాన్వాయ్ లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు.

దీంతో వాహనాలు దిగి.. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande