స్పీకర్పై తాతా మధు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు: మహేశ్ గౌడ్
బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని మండలిలో తీర్మానం పెట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనువాద పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
Mahesh goud


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని మండలిలో తీర్మానం పెట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మనువాద పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ ప్రజలకి అవసరమే లేదని.. ఆ పార్టీ ఆలోచన విధానంలోనే దళిత వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీయే అని అనేకసార్లు రుజువైందన్నారు.

భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడైతే బీఆర్ఎస్ తట్టుకోలేకపోయిందని టీపీసీసీ చీఫ్ అన్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ అయితే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. దళిత స్పీకర్ను అధ్యక్ష అని అనలేకనే కేసీఆర్ సభకి రావడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande