కేటీఆర్, హరీష్ రావుల పై నాన్ బెయిలబుల్ కేసులు
తెలంగాణ శాసనసభ సమావేశాల తొలి రోజు అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు తీవ్రస్థాయిలో చర్యలకు దిగారు.
KTR Harish


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ శాసనసభ సమావేశాల

తొలి రోజు అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు తీవ్రస్థాయిలో చర్యలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం '1000 రోజుల వైఫల్య పాలన' అంటూ బీఆర్ఎస్ సభ్యులునల్ల టీ-షర్టులతో సభకు హాజరయ్యేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యానికి దిగడం వంటి ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శంబీపూర్ రాజులతో పాటు కీలక నేతలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 121(1), 132, 74, 79, 351, 353 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

బీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు బీఆర్ఎస్ నేతల నివాసాలకు చేరుకుని అరెస్టుల పర్వానికి తెరలేపాయి. కేటీఆర్, హరీష్ రావు ఇళ్లకు పోలీసులు చేరుకుంటున్నారన్న సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు వారి నివాసాల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్లోని ముఖ్య నేతల నివాసాలు మరియు క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande