
ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఆరంభానికి భద్రతా వైఫల్యం నెలకొంది. ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ఆవిష్కరణకు ప్రధాని రాక నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని తనిఖీ చేసిన పోలీసులు అనంతరం.. అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా నకిలీ ఐడీ కార్డు కలిగిన వ్యక్తిని రోషన్ పరేఖ్గా గుర్తించారు. అతడి బాడీగార్డ్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్