
ఢిల్లీ, 08 సెప్టెంబర్ (హి.స.)మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ హైవేపై నగ్రా గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం
జరిగింది. మధ్యప్రదేశ్లోని కిర్నాపూర్, లాంజి తహసీల్ ప్రాంతాలకు చెందిన కొందరు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఉదయం బొలెరే వాహనంలో తెలంగాణకు బయల్దేరారు. హైదారాబాద్లో వీరంతా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి వాహనం నగ్రా గ్రామానికి చేరుకోగానే.. హైవేపై ఎదురుగా, వేగంగా వస్తున్న ట్రక్కు బొలెరే వాహనాన్ని ఢీకొంది. ట్రక్కు వేగం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అందులో ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలుj కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్తానికులు పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చే లోగా గ్రామస్తులే సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్