కాంగ్రెస్, బీఆర్ఎస్ 'కాంప్రమైజ్ పాలిటిక్స్': కేంద్ర మంత్రి బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ 'కాంప్రమైజ్ పాలిటిక్స్': కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ శాసనసభ సమావేశాల

తీరు, అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరు పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయ డ్రామాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నేతల బజారు భాష చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

స్పీకర్పై బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని స్పష్టం చేశారు. తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కలుగులో దాక్కున్నారని, అసెంబ్లీకే రానప్పుడు ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకని నిలదీశారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యతో ప్రజలు అల్లాడిపోతుంటే, మంత్రులు, అధికార పార్టీ నేతలు వేల కోట్ల రూపాయల భూదండాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande