జపాన్ లో అనూహ్య పరిణామాలు.. ప్రధాని రాజీనామా.. మంత్రివర్గం మొత్తం రద్దు
జపాన్, 1 అక్టోబర్ (హి.స.) జపాన్ లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా షిగెరు ఇబగ ఎన్నికయ్
జపాన్ ప్రధాని రాజీనామా


జపాన్, 1 అక్టోబర్ (హి.స.)

జపాన్ లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా షిగెరు ఇబగ ఎన్నికయ్యారు.

2021 నవంబర్ 1వ తేదీన జపాన్ ప్రధానిగా ఫ్యుమియో కిషిడ బాధ్యతలను స్వీకరించారు. ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలనలో కిషిడ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సైతం లభించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు ఆమోద ముద్ర లభించింది.

ఆ వెంటనే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. కాబోయే ప్రధానమంత్రిగా షిగెరు ఇబగ పేరును ప్రతిపాదించింది. జపాన్ కాలమానం ప్రకారం- ఈ సాయంత్రానికి లేదా బుధవారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

ఉదయం ఫ్యుమియో కిషిడ ఆకస్మికంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ముఖ్య కార్యదర్శి యొషిమష హయాషీ ప్రకటించారు. మంత్రివర్గం మొత్తం రద్దయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, మధ్య ఆసియాలో జపాన్ను శక్తిమంతమైన దేశంగా నిలబెట్టలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటం, నిరుద్యోగం.. వంటి కీలకాంశాలపై ఫ్యుమియో కిషిడ చురుగ్గా వ్యవహరించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి.

కొత్త ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడానికి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ పలు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. మెజారిటీ నాయకులు షిగెరు ఇబగ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. కాగా- కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి కూడా. దీనికోసం కొన్ని పేర్లను సూచించింది లిబరల్ డెమొక్రటిక్ పార్టీ.

పర్యావరణ శాఖ మంత్రిగా షింజిరో కొయిజుమి, విదేశాంగ శాఖ మంత్రిగా టకెషి ఇవాయా, రక్షణ శాఖ చీఫ్గా జనరల్ నటకని అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande