జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, 18 అక్టోబర్ (హి.స.) జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి.ఈ పోటీలను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అడిషనల్
స్పోర్ట్స్ న్యూస్


జనగామ, 18 అక్టోబర్ (హి.స.) జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి.ఈ పోటీలను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అడిషనల్ కలెక్టర్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పింకేశ్ కుమార్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు శారీరక వికాసం కోసం క్రీడలు చాలా అవసరం అన్నారు. మండల స్థాయిలో విజయం సాధించి, జిల్లా స్థాయికి వచ్చిన ప్రతి క్రీడాకారుడిలో ప్రతిభ ఉన్నట్లేనని, జిల్లా స్థాయిలో ఓడినంత మాత్రాన బాధ పడవద్దని, ఓటమి గెలుపుకు నాంది プ తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జనగామ జిల్లా నుంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి గ్రామాలలో ఉన్న క్రీడా కారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుల పై ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande