వినోదం, 23 అక్టోబర్ (హి.స.)
మారుతి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. హారర్ కామెడీ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాలో , మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పోస్టర్స్ ఆసక్తిని పెంచాయి. తాజాగా, నేడు (అక్టోబర్ 23)న డార్లింగ్ ప్రభాస్ బర్త్డే కావడంతో 'రాజాసాబ్' మూవీ మేకర్స్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో ప్రభాస్ స్టన్నింగ్ లుక్తో అదరగొట్టాడు. పోస్టర్లో ఏముందంటే.. అడవిలో పియానో ప్లే అవుతుండగా ఒక భవంతిలోకి తీసుకెళ్లి ప్రభాస్ ముసలి గెటప్లో చుట్ట కాలుస్తూ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. ఈ మోషన్ పోస్టర్కు హారర్ మ్యూజిక్ను యాడ్ చేసి అదుర్స్ అనేలా ఎడిట్ చేశారు.
చివర్లో హారర్ కొత్త రకం కామెడీ అని పోస్ట్ చేయడంతో 'రాజా సాబ్' మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రజెంట్ ప్రభాస్ షాకింగ్ లుక్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఇక దాన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కొందు లుక్ మాత్రం అదిరిపోయిందని అంటుంటే.. మరికొందరు మాత్రం తాత్ లుక్లో పాన్ ఇండియా స్టార్ను చూసి షాక్ అవుతున్నారు. కాగా, 'రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్లో విడుదల కాబోతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్