కొనసాగుతున్న షేర్ మార్కెట్ నష్టాలు
బిజినెస్, 27 అక్టోబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని నెలలుగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ నుంచి నెగటివ్ సిగ్నల్స్, త్రైమాసిక ఫలితాల్లో చాలా వరకు కంపెనీలు ఆశించినంత మేర రాణించకపోవడం వంటివి స్టాక్ మ
బిజినెస్ న్యూస్


బిజినెస్, 27 అక్టోబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని నెలలుగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ నుంచి నెగటివ్ సిగ్నల్స్, త్రైమాసిక ఫలితాల్లో చాలా వరకు కంపెనీలు ఆశించినంత మేర రాణించకపోవడం వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ షేర్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఈ నెల ప్రారంభం నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా షేర్లను సేల్ చేశారు. అలాగే ఎక్కువ మొత్తంలో ఫండ్స్ ను కూడా ఉపసంహరించుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande