నేడు వైజాగ్ బీచ్ రోడ్ లో సందడి చేయనున్న సూర్య..
విజయవాడ, 27 అక్టోబర్ (హి.స.)కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు
నేడు వైజాగ్ బీచ్ రోడ్ లో సందడి చేయనున్న సూర్య..


విజయవాడ, 27 అక్టోబర్ (హి.స.)కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్ దిశా పటానీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కానుంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ మరియు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించగా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానుల చూపించిన ప్రేమకు సూర్య ఎమోషనల్ అయ్యాడు. తాజాగా కంగువ మేకర్స్ వైజాగ్ లో మరో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ ఆదివారం అక్టోబర్ 27న సాయంత్రం 5 గంటలకి RK బీచ్ రోడ్ గోకుల్ పార్క్ లో కంగువ మీట్ ని నిర్వహిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande