ఆన్లైన్ బెట్టింగ్ కు ఇంజనీరింగ్ విద్యార్థి బలి
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామానికి చెందిన గణేష్ హైదరాబాద్ ఘట్కేసర్ లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన సదరు యువకుడు తెలిసిన వారి వద్ద సుమారు 7లక్షల రూపాయలు అప్ప
ఆన్లైన్ బెట్టింగ్


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామానికి చెందిన గణేష్ హైదరాబాద్ ఘట్కేసర్ లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన సదరు యువకుడు తెలిసిన వారి వద్ద సుమారు 7లక్షల రూపాయలు అప్పు చేశాడు. చేసిన ఆ అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande