హైదరాబాదులో నెలరోజులపాటు ఆంక్షలు.. నిరాశలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ 
వినోదం, 29 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ ఉంటుందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంటే నెల రోజుల పాటు సభలు, దర్నాలు, ర్యాలీలు, సినిమా ఈవెంట్ లు హైదరాబాద్ లో నిషేధం. అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో ఐదుగురికి మించి ఉండకూడదని ప
అల్లు అర్జున్


వినోదం, 29 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ ఉంటుందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంటే నెల రోజుల పాటు సభలు, దర్నాలు, ర్యాలీలు, సినిమా ఈవెంట్ లు హైదరాబాద్ లో నిషేధం. అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో ఐదుగురికి మించి ఉండకూడదని పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.

మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే, ఈ ఆంక్షలకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. పాన్ ఇండియాగా వస్తున్న ఈ మూవీని దేశమంతా ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. దీంతో, నవంబర్ చివర్లో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఇప్పుడు, పోలీసులు 144 సెక్షన్ పెట్టడంతో ఆ ఈవెంట్ కి పర్మిషన్ రాదని అంటున్నారు.

పుష్ప 2 ప్రమోషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ పెడతామని నిర్మాతలు ఇటీవల ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే, హైదరాబాద్ లో పుష్ప 2 ఈవెంట్ ఉండకపోవచ్చని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉన్నా.. నవంబర్ 28 తర్వాత పెట్టుకోవాలి. అప్పటికి రిలీజ్ కి వారం మాత్రమే ఉంటుంది. రీసెంట్ గా దేవర సినిమా కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా అలాగే చేస్తారేమో చూడాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande